‘
ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎస్ఎస్
రాజమౌళి చేయబోతున్న ప్రాజెక్ట్ కోసం ప్రపంచమే ఎదురు చూస్తోంది. మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు, ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ నటించబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీని కోసం హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ సీఏఏ కాస్టింగ్ చేయనుండగా.. ఇప్పటికే జక్కన్న అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం.