హాలీవుడ్ ప్రముఖ నిర్మాత కెవిన్ ట్యూరెన్ చనిపోయారు. 44 ఏళ్ల వయసులో శనివారం న్యూయార్క్ ఆయన తుదిశ్వాస విడిచారు. 'యుఫోరియా', 'ది ఐడల్' వంటి కొన్ని ప్రసిద్ధ HBO షోల ద్వారా ఆయన సుపరిచితుడు. అయితే ఆయన మరణానికి కారణం ఇంకా తెలియలేదు. కెవిన్ మృతిని ఆయన సన్నిహితుడు, పెన్స్కే మీడియా కార్పొరేషన్ సీఈవో జే పెన్స్కే మంగళవారం వెల్లడించారు. కెవిన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.