'రైతులను ఇంకెన్నిసార్లు మోసం చేస్తావ్ రేవంత్ రెడ్డి'

84చూసినవారు
'రైతులను ఇంకెన్నిసార్లు మోసం చేస్తావ్ రేవంత్ రెడ్డి'
TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి ఫైరయ్యారు. రైతులను ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు రేవంత్ రెడ్డి అంటూ హరీశ్ రావు మండిపడ్డారు. మార్చి 31 కల్లా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పిన రేవంత్ మరోసారి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మాటలు నమ్మిన రైతులకు ఉగాది వేళ చేదు అనుభవమే ఎదురైందని తెలిపారు. వెంటనే రైతు భరోసా నగదు జమ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్