ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి విలువే లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ వ్యక్తి తన భార్యను మరో వ్యక్తితో ఏకాంతంగా ఉండటం చూసి పట్టుకున్నాడు. అయితే సదరు వ్యక్తి తన కారులో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడు కారు బానెట్‌ను పట్టుకొని కూర్చొన్నాడు. ప్రియుడు వేగంగా కారును పోనిచ్చాడు. స్థానికులు గమనించి వాహనాన్ని ఆపారు. దీంతో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.