హైదరాబాద్ లో మరో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం అంబర్ పేట్ లోని తన నివాసంలో భాను శంకర్ ఉరి వేసుకున్నాడు. అయితే భాను వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత వారం వ్యవధిలోనే ముగ్గురు పోలీసులు హైదరాబాద్ లోనే సూసైడ్ చేసుకోవడం గమనార్హం. అయితే భాను శంకర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.