బహదూర్ పురా లోని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ను బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ గురువారం కలిశారు. నిన్న పాఠశాలలో విద్యార్థుల మధ్య గ్రూప్ వార్ జరిగిన ఘటనపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల విద్యార్థులు చదువుకునే చోట ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. మరోసారి ఇటువంటివి జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.