రానున్న న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో పెట్టుకుని నగర పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం, మత్తుపదార్థాల కట్టడికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలుప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో 100 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. వీటి విలువ రూ. 2 లక్షలు ఉంటుందని అంచనా. అలాగే మత్తుపదార్థాలు తరలించే ముఠాలను కూడా అరెస్టు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.