చార్మినార్: చికెన్, మటన్ షాపులలో తనిఖీలు
చార్మినార్ జోన్ పరిధిలో వెటర్నరీ అధికారులు చికెన్, మటన్ షాపులను సోమవారం జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. శుభ్రత పాటించని వారికి జరిమానా విధించినట్లు వెల్లడించారు. చికెన్, మటన్ షాపులలో తప్పకుండా జిహెచ్ఎంసి నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. లేకపోతే మరోసారి తనిఖీ చేసి శుభ్రత లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.