పార్లమెంటులో రవాణారంగ కార్మికుల సమస్యలపై చర్చించాలి
హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు జనాబ్ అసదుద్దీన్ వొవైసీని గురువారం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు అజయ్ బాబు, అసిఫ్, సతీష్ కలిశారు. ప్రధానంగా రవాణరంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పార్లమెంట్లో చర్చించాలని, డ్రైవర్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు దిశలో కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ లో చర్చించాలని, మరికొన్ని డిమాండ్స్ ని పొందుపరచి వినతిపత్రం అందచేశారు.