హైదర్ గూడ శివ నగర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు

82చూసినవారు
హైదర్ గూడ శివ నగర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్తాపూర్ డివిజన్ హైదర్ గూడ శివ నగర్ కాలనీ బూత్ నెంబర్ 230 లో ఇంటింటికి తిరిగి ప్రజలను 8800002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇప్పించి, నమో యాప్ ద్వారా బీజేపీ మెంబెర్ షిప్ ఇప్పించడం జరిగిందని పార్టీ నాయకులు అన్నారు. ప్రతి బూతులో 200కు పైగా సభ్యత్వం తప్పకుండా చేయాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్ బిజెపి కన్వీనర్ నారగూడెం మల్లారెడ్డి, అత్తాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు సాబాద విజయ్ కుమార్, మూసి ప్రక్షాళన కమిటీ కన్వీనర్ ఎస్ జయానంద రెడ్డి, సులిగే శ్రీనివాస్, గొల్ల అనిల్, పి. సంతోష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్