జగదేవపూర్: ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం వట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిపారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును, రాజ్యాంగ విశిష్టతను హెచ్ఎం సరోజ విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని తెలిపారు.