కాలేజీలో వెలసిన కృష్ణుని విగ్రహం

545చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీలో చొరబడి తాళాలు పగులగొట్టి కాలేజీ లోపల కృష్ణుడి విగ్రహం పెట్టారు. ఈ ఘటన శుక్రవారం హైదరాబాద్ రాంకోఠిలోని అమ్రత కాపాడియా నవజీవన్ ఉమెన్స్ కాలేజీలో చోటుచేసుకుంది. సుల్తాన్ బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఎవరో కావాలనే విగ్రహం పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు ఆ విగ్రహం పెట్టారనే కోణంలో పోలీసులు సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్