హైదరాబాద్ నగరంలో అనుసంధాన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను శనివారం హైదరాబాద్లో ఆదేశించారు. హెచ్ఆర్‌డీసీఎల్ సమీక్షలో 49 లింక్ రోడ్ల నిర్మాణంపై చర్చించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అదనపు భూసేకరణకు వ్యయంపై వెనుకడకుండా ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేయాలని సీఎం స్పష్టం చేశారు.