జూబ్లీహిల్స్: షేక్ పేట్ లో భారీ చోరి

70చూసినవారు
ఫిలిం నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ డైమండ్ హిల్స్ లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బీరువా తాళాలు పగులగొట్టిన దుండగులు 34 తులాల బంగారు ఆభరణాలు, రూ. 4. 5 లక్షల నగదు, విదేశీ కరెన్సీ అపహరించారు. సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లారు. రంజాన్ మాసం కావడంతో మోజాహిత్ సోమవారం బంధువుల ఇంటికి వెళ్ళారు. తిరిగి వచ్చేలోపు చోరీ జరిగినట్లు పోలీసులకు పిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్