జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉగాది వేడుకలు

68చూసినవారు
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్