హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

80చూసినవారు
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టకుండా అర్హులందరికీ న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తులను ఈనెల 31లోపు పరిశీలించి యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్