తెలంగాణ రైతులను ఆదుకోవాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని శనివారం సీఎం రేవంత్ అన్నారు. అందరి సూచనలు పరిగణలోకి తీసుకుని రైతాంగానికి మరింత మేలు కలిగే రీతిలో రైతు భరోసాను అమలు చేస్తాం అన్నారు. రైతు భరోసా అమలు విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదు. గడిచిన ఐదేళ్లలో దాదాపు 22 వేల కోట్ల మేరకు రాళ్లు, రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు పంచారు. అలాంటి వాటి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సూచనలు ఇవ్వాలని కోరారు.