జల్లపల్లిలోని మంచు టౌన్ షిప్‌లో మూడు రోజులుగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో నోటీసులు అందుకున్న మంచు మనోజ్ బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు అదనపు జల్లా మెజిస్ట్రేట్ హోదాలో విచారించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని మనోజ్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలో మనోజ్ పోలీసుల ఆదేశాలకు కట్టుబడి ఉంటానని బాండ్ రాసి ఇచ్చారు. దీంతో మంచు మనోజ్‌ను పోలీసులు బైండోవర్ చేశారు.