బొడుప్పల్ మున్సిపల్ ఆఫీస్ లో కొండా లక్ష్మణ్ బాపూజీకి బొడుప్పల్ మున్సిపల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటి మేయర్ కొత్త స్రవంతి కిషోర్ సమక్షంలో శుక్రవారం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, ప్రభాకర్ గౌడ్, రంగ బ్రహ్మన్న, కుర్రి శంకర్ , కొత్త ప్రభాకర్ గౌడ్ మరియు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.