మేడ్చల్: విఆర్ఓ లను షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోకి సర్దుబాటు చేయాలి

58చూసినవారు
మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో విఆర్ఓ లు పూర్వ విఆర్ఓల అత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉద్యోగులు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి హాజరై మాట్లాడారు. 5139 మంది విఆర్ఓ లను ఎటువంటి షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోకి సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పే ప్రొటక్షన్ సర్వీస్ ప్రొటక్షన్ కల్పించాలని, విఆర్ఓ ల అందరిని తిరిగి ఆప్షన్ పద్దతిలో రెవెన్యూ శాఖలోకి సర్దుబాటు చేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్