సికింద్రాబాద్: రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య

80చూసినవారు
సికింద్రాబాద్: రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
వ్యక్తిగత ఇబ్బందుల నేపథ్యంలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన డబిలురలో జరిగింది. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ చేగుంట ప్రాంతానికి చెందిన మహేష్ (23) బేగంపేట ప్రకాశ్నగర్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా శనివారం మేడ్చల్-డబిల్ పుర రైల్వే స్టేషన్ల మధ్య ఎదురుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్