గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్‌ను అల్లు స్నేహారెడ్డి హత్తుకున్నారు. గుక్కపెట్టి ఏడ్చిన ఆమెను బన్నీ ఓదార్చారు. అనంతరం పిల్లలు అయాన్, అర్హ, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆప్యాయంగా హత్తుకొని ఎమోషనల్ అయ్యారు. వచ్చేశానుగా, అదైర్యపడొద్దు అని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.