ముషీరాబాద్: పూట్ పాత్ పనులను పరిశీలించిన కార్పొరేటర్
గాంధీ నగర్ డివిజన్ లోని అశోక్ నగర్ చౌరస్తాలో పూట్ పాత్ పనులను డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, జీహెచ్ఎంసీ ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ లతో కలిసి బుధవారం పరిశీలించారు. పూట్ పాత్ నిర్మాణ పనులను త్వరగా పూర్తీ చేయాలని కార్పొరేటర్ అధికారులను సూచించారు. అశోక్ నగర్ చౌరస్తా నుంచి బ్రిడ్జి వరకు ప్రధాన రహదారి అనుసంధానంగా పూట్ పాత్ పనులు చేపడుతున్నట్లు కార్పొరేటర్ చెప్పుకొచ్చారు