సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు ఎంఐఎం నేతలు ప్రజలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు. రాంగోపాల్ పేట్ డివిజన్ ఎంఐఎం నేత అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రోగుల అటెండర్లకు, అనాథలకు, ఫుట్పాత్పై ఉండే వందలాది మంది నిరుపేదలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పేదలకు సహాయం చేయడంలోనే ఆనందం ఉంటుందని మహిళా నేతలు అన్నారు.