రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న 218వ జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీవీసీ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎంబీసీ చైర్మన్ జేరిపేటి జైపాల్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధ్వర్యంలో వడ్డెర ఓబన్న జయంతి నిర్వహించడం సంతోషకరమన్నారు.