రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. వారందరికీ మంత్రి స్వయంగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుతో ప్రజలు ఇబ్బందులు ఆడుతూనే ఉన్నారన్నారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.