తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల కపరులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గొర్రెల కాపారుల సంక్షేమ సంఘం (జీకేఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం బషీర్ బాగ్ లో ఆయన మాట్లాడారు. వీడీసీల పేరుతో గ్రామాల్లో గొల్ల కురుమలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పడకేసిన పశువైద్యాన్ని రివ్యూ చేయాలని కోరారు.