తన భూమిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సబ్ స్టేషన్ పనులు ప్రారంభించారని గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన మెడ మహాలక్ష్మి అనే మహిళ ఆదివారం తన సమస్యను డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు చెప్పుకునేందుకు ప్రజాభవన్ వద్దకు రాగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె ప్రజాపాలన అంటారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారిని మాత్రం కలవనియ్యరు. ఇదేమి న్యాయం అంటూ పోలీసులపై, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.