ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు: దొంతుల రమేష్

67చూసినవారు
ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు: దొంతుల రమేష్
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, తెలంగాణ ముదిరాజ్ సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దొంతుల రమేష్ ముదిరాజ్ ఆడపడుచులకు తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ భగవంతుడిని పూలతో పూజిస్తాం. అదే పూలను కొలిచే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతం. పువ్వులను భగవంతుడిగా కొలుస్తూ తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు బతుకమ్మ పండుగను గొప్పగా చేసుకుంటారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి వైభవంగా నిర్వహిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్