భార్య నుండి విడాకులు ఇప్పించాలి అంటూ యువకుడి హల్చల్

7456చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ పోలీస్టేషన్ పరిధి కొంపల్లి జయభేరి పార్క్ చెరువు వద్ద యువకుడు గురువారం హల్ చల్ సృష్టించాడు. తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని, లేదంటే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని నగేష్ అనే యువకుడు గంట పాటు బెదిరింపుకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని తన సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో తాడు సహాయంతో బయటికి వచ్చాడు.

సంబంధిత పోస్ట్