రాష్ట్ర స‌మాచార క‌మిష‌న‌ర్ల నియామకానికి మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తులు

78చూసినవారు
రాష్ట్ర స‌మాచార క‌మిష‌న‌ర్ల నియామకానికి మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తులు
రాష్ట్ర స‌మాచార క‌మిష‌న‌ర్ల నియామకానికి తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తుల ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. అర్హులైన వారు ఈ నెల 29వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను పంపించాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనూ ద‌ర‌ఖాస్తుల‌ను అధికారులు స్వీక‌రించారు. గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసిన వారు మ‌ళ్లీ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎస్ పేర్కొన్నారు.