సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బస్తి పర్యటన

243చూసినవారు
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బస్తి పర్యటన
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదితలు అన్నారు. సోమవారం కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని రెండవ వార్డు సిల్వర్ కాంపౌండ్, రసూల్ పురా, 105 గల్లి, తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు, స్థానికులతో కలిసి వారు పర్యటించారు. ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా సీసీ రోడ్లు, తాగునీరు పైపులైన్, డ్రైనేజీ తదితర సమస్యలను లాస్య నందిత కు స్థానికులు విన్నవించారు. సమస్యలను విన్న నందిత వాటి పరిష్కారం కొరకు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ ఏడో వార్డు మహిళ అధ్యక్షురాలు నాగినేని సరిత, కుమార్ ముదిరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, 2వ వార్డు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్