కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రెండో వార్డ్ గన్ బజార్, రసూల్ పుర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి. ఎన్. శ్రీనివాస్ హాజరై ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం
కేసీఆర్ విద్యకు ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తున్నారని ఆయన అన్నారు.
అందులో భాగంగానే సోమవారం నాడు పాఠశాల ప్రారంభం అయిన నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణేష్ తో కలసి విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, ప్రేమలత, సయాది సుల్తాన్, మార్కెట్ డైరెక్టర్ దేవలపల్లి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామ్ రెడ్డి, నరసింహ, వహాబ్ ఉస్మాన్, సురేష్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.