సికింద్రాబాద్ కంటోన్మెంట్ - Secunderabad Cantt

సికింద్రాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కే సొంతం

సికింద్రాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కే సొంతం

సికింద్రాబాద్ ఎంపీ సీట్ బీఆర్ఎస్ కే సొంతం అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం యూసఫ్ గూడ మహమూద్ గార్డెన్ లో జరిగిన ముస్లిం సోదర సోదరీమణుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులను చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే పద్మారావు గౌడ్ ను గెలిపిస్తాయని తెలిపారు. పద్మారావు గౌడ్ కూడా ఈ ప్రాంతానికి చెందిన వాడే అని తనకి కూడా మంచి అవకాశం కల్పించాలని కోరారు.

వీడియోలు


హైదరాబాద్