సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 7 లక్షల విలువైన 14 కిలోల గంజాయి శుక్రవారం రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పదవ ప్లాట్‌ఫామ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ బ్యాగును పరిశీలించగా, ఐదు ప్యాకెట్ల గంజాయి లభ్యమైంది. గంజాయి ఎవరిచే ఉంచబడిందనే అంశంపై పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసేందుకు విచారణ ముమ్మరం చేశారు.