వారసిగూడా, అంబర్నగర్లో ఇళ్లలోకి వరద నీరు

57చూసినవారు
సికింద్రాబాద్ పరిధిలోని తార్నాక, మెట్టుగూడ, బౌద్ధనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొడుతుంది. బౌద్ధనగర్ డివిజన్ పరిధిలోని వారసిగూడా, అంబర్నగర్ తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వరద వల్ల అంబర్నగర్లోని లోతట్టు ప్రాంతాల బస్తీలలో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద వల్ల ఇళ్ల ముందు పార్కింగ్ చేసి ఉంచిన వాహనాలు నీటమునిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్