సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ గురువారం వాటర్ వర్క్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న ఎండాకాలన్ని దృష్టిలో ఉంచుకుని నీటి కొరత లేకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే కలుషిత నీరు వస్తున్నాయని ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.