ఎంఎంటీఎస్ బాధితురాలిని పరామర్శించిన కేంద్రమంత్రి

60చూసినవారు
ఎంఎంటీఎస్‌ ట్రైన్‌లో అత్యాచార యత్న ఘటనలో గాయపడిన యువతిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి చికిత్స ఖర్చును కేంద్రం భరిస్తుందని, కుటుంబానికి ఎటువంటి భారం లేకుండా చూస్తామని అన్నారు. రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్