జంట నగరాల పరిధిలోని మందుబాబులకు పోలీసులు షాకిచ్చారు. ఆదివారం శ్రీరామ నవమి పర్వదినం సదర్భంగా హైదరాబాద్ పరిధిలోని మొత్తం వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు వైన్ షాపులు బంద్ చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నట్లుగా పేర్కొన్నారు.