సికింద్రాబాద్ - Secunderabad

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగంలోని ముఖ్యాంశాలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగంలోని ముఖ్యాంశాలు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఎన్నికల సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి నమస్కరించి ఈ విధంగా మాట్లాడారు. ఈటెలకు, బీజేపీకి మీరిచ్చే ఒక్కో ఓటు మోడీని మరోసారి ప్రధానిని చేస్తాయి అన్నారు. ఇండియా కూటమికి అసలు నాయకత్వమే లేదు అని, 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ కావాలా?. 23 ఏండ్లుగా సీఎం, పీఎంగా ఉన్న ఒక్క అవినీతి లేని మోదీ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి అన్నారు. మేం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం అన్నారు. ఈటెల వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి అని వారికి అందరూ అండగా నిలవండి అని అన్నారు. మోదీ రిజర్వేషన్లు తొలగించలేదు. 370 రద్దుచేశారు, ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు, రామమందిర నిర్మాణం చేశారు అన్నారు. మోదీ, బీజేపీ ఉన్నంత వరకు ఈ దేశం నుంచి రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు అన్నారు. ఆర్ఆర్ టాక్స్ ద్వారా తెలంగాణ డబ్బులతో యావద్భారతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారింది. ఇక్కడ మల్కాజిగిరి ఎంపీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యేను గెలిపిస్తే ఈ ఏటీఎంలో డబ్బుల్లేకుండా చేస్తాం. తెలంగాణను అన్నిరకాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటోంది అన్నారు.

వీడియోలు


హైదరాబాద్