
హైదరాబాద్: మహిళ మృతి కేసులో ట్విస్ట్. సూసైడ్ లెటర్ లభ్యం
సికింద్రాబాద్ వారాసిగూడలో మృతి చెందిన లలిత మృతికి సంబంధించి ఆమె కూతుర్లు రాసిన ఒక సూసైడ్ లెటర్ లభ్యం అయింది. అందులో తన తల్లి మృతికి తన మేనమామ రమేష్ కారణమని, పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి పట్టించుకోలేదు అని ఉంది. తల్లి మృతితో మానసిక ఒత్తిడికి గురైన వారు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఉంది. లలిత మృతదేహానికి శనివారం గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు.