మూటలో మహిళను చంపి ఆమె శవాన్ని బ్లాంకెట్లో చుట్టి ప్లాస్టిక్ కవర్లో డ్రైనేజీ పక్కన పడేసిన మహిళా హత్య కేసు మిస్టరీలో షాద్ నగర్ పోలీసులు పురోగతి సాధించారు. కేవలం మూడు రోజుల్లోనే కేసులోని మిస్టరీని ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హత్య కేసు వివరాలను షాద్ నగర్ ఏసిపి ఎన్. సిహెచ్ రంగస్వామి మంగళవారం మీడియాకు వెల్లడించారు.