తన అల్లుడు ఎలాంటి తప్పు చేయలేదని హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ ఆశీర్వాదాలు తన అల్లుడిపై ఉన్నాయని, మద్దతు తెలిపినందుకు థాంక్స్ తెలిపారు. కాగా చంచల్ గూడ జైలు వద్దకు భారీగా చేరుకున్న బన్నీ అభిమానులు జై అల్లు అర్జున్ అంటూ నినాదాలు చేశారు.