టీమ్ ఇండియా బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ICC షాక్ ఇచ్చింది. అడిలైడ్ టెస్టులో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ICC ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని నిర్ధారించింది. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానా విధించింది. హెడ్ కూడా రూల్స్ ఉల్లంఘించినట్లు తేలడంతో ఇద్దరు ఆటగాళ్లు తమ క్రమశిక్షణా రికార్డులపై ఒక్కో డీమెరిట్ పాయింట్స్ పొందారు.