TG: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్వాడలో రాజమణి (35) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురైన రాజమణి గురువారం తెల్లవారుజామున ఇంట్లోని హాలులో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందిందని కుటుంబ సభ్యులు సమాచారమిచ్చారని మంచిర్యాల ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేయనున్నట్లు వివరించారు.