TG: ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను బుధవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో భూమిలేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేసింది. మండలానికి ఒక గ్రామం చొప్పున రైతు కూలీల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఇవాళ 66,240 మంది రైతు కూలీల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు 83,420 మందికి రూ 50.65 కోట్లు చెల్లించారు.