ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక మరింత ఆలస్యం!

73చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల ఎంపిక మరింత ఆలస్యం!
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను ప్రకటించడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభల్లో అర్హుల జాబితాను మాత్రమే ప్రకటిస్తున్నారు. లబ్ధిదారుల జాబితాను ప్రకటించడం లేదు. ఈ నెల 26న ప్రభుత్వం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత కొంత సమయం తీసుకొని పూర్తి స్థాయి లబ్ధిదారుల జాబితా(నియోజకవర్గానికి 3,500 ఇళ్లు)ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్