AP: మాజీ ఎమ్మెల్యే వంశీతోపాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తికి వంశీ తెలిపారు. జైలులో ఒంటరిగా ఉంచుతున్నారని వంశీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వంశీ ఆరోగ్యరీత్యా ఒంటరిగా ఉంచవద్దని కోర్టును న్యాయవాది కోరారు. ఆయనకు ఆస్తమా ఉందని వంశీ కోర్టులో పేర్కొన్నారు. వంశీని నలుగురు లేదా ఐదుగురు ఉన్న బ్యారక్‌లో ఉంచాలని లాయర్ కోర్టులో వివరించారు.