ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పటి మిత్ర దేశాలు

67చూసినవారు
ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పటి మిత్ర దేశాలు
బద్ధ శత్రువులుగా మారిన ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పటి మిత్రులే. 1960లలో ఇరాన్, ఇజ్రాయెల్‌కు ఉమ్మడి శత్రువు ఇరాక్. అరబ్ దేశాల ముప్పుతో నాడు ఇజ్రాయెల్ ఇబ్బంది పడేది. షియాల పాలనలోని ఇరాన్.. ఇరాక్‌లోని సున్నీ నాయకత్వాన్ని తమ ప్రాంతీయ విస్తరణ లక్ష్యాలకు ముప్పుగా పరిగణించేది. దీంతో ఇరాన్‌కు చెందిన సీక్రెట్ పోలీస్ యూనిట్ సావక్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ కలిసి కుర్దు వేర్పాటు వాదులను బలోపేతం చేసేవి.

సంబంధిత పోస్ట్