ధర్మారం మండలంలోని నంది మేడారం, మల్లాపూర్ గ్రామాలలో మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జ్వర పీడితులతో పాటు బీపీ, షుగర్ తదితర వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయనట్లు తెలిపారు.